ఒక వ్యక్తి పట్ల అనుచితంగా వ్యవహరించడం లేదా వ్యక్తిగత గుర్తింపు అంశాల ప్రాతిపదికన వారికి (ఇతరులతో సమానంగా) అవకాశాలను తిరస్కరించడం వంటివాటిని ‘వివక్ష’గా నిర్వచించవచ్చు. కింది అంశాల ఆధారంగా ఎవరైనా వివక్షకు గురికావచ్చు:
కొన్నిసార్లు వివక్ష (దూషణ, దుర్భాషల రూపంలో) స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది… అదే సమయంలో స్పష్టంగా లేదా అస్పష్టంగా (వ్యక్తిగత గుర్తింపు కారణంగా ఒకే అధ్యయన/ కార్యాచరణ బృందంలో వారుండటానికి ఇష్టపడకపోవడం, వారిని తప్పించడం లేదా నిరోధించడం, అవకాశాలను తిరస్కరించడంవంటి రూపాల్లో) చోటుచేసుకోవచ్చు.
కారణం లేదా విధానం ఏదైనప్పటికీ వివక్ష ఎన్నడూ సరైనది కాదని గుర్తుంచుకోవడం అవసరం. వివక్షకు గురైనవారు ఆ కారణంగా తీవ్ర ఒత్తిడికి, అభద్రతకు, ఆగ్రహానికి, న్యూనత భావానికి లోనుకావచ్చు లేదా తామిక్కడ ఉండటానికి తగినవాళ్లం కాదన్న ఒంటరి భావనకు గురికావచ్చు.
ఒకవేళ వివక్షకు గురయ్యామని మీకు అనిపిస్తే కింది అంశాలను తెలుసుకోండి
మీరు చేయదగినవి...
యువతరం ప్రతినిధులుగా మనవైన హక్కుల గురించి తెలుసుకోవడానికి కాస్త సమయం కేటాయించడం చాలా అవసరం. మనలో కొందరు కొన్ని సమూహాలకు, వర్గాలకు చెందినవారు కావడంవల్ల ఇతరులకు లభించని కొన్ని ప్రయోజనాలతోపాటు అవకాశాలు మనకు అందుబాటులో ఉంటాయి. మనకు కొన్ని హక్కులు ఉండటమంటే మనం ఎలాంటి కష్టాలను ఎదుర్కొనలేదని లేదా అవకాశాల సద్వినియోగంలో లేదా మైలురాళ్లను చేరుకోవడంలో శ్రమించలేదని అర్థం కాదు. ఇతరులకు ఎదురైన కొన్ని అడ్డంకులను మనం ఎదుర్కొనాల్సిన అవసరం లేదని మాత్రమే దీనికి అర్థం.
పైన పేర్కొన్న అంశాలపై అవగాహన కలిగి ఉండటమన్నది మరింత సముచిత వాతావరణం సృష్టించుకునే దిశగా మనకు దోహదపడుతుంది.